గాజువాక, పున్నమి ప్రతినిధి:
బీజేవైఎం గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడిగా జాగారపు శ్రీను నియమితులయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గాజువాక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, గాజువాక ఇన్‌చార్జ్ కరణంరెడ్డి నర్సింగ్‌రావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
గత 15 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తున్న శ్రీను సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. యువతకు అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు.
తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీను.. యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. “ఇది కేవలం పదవి కాదు.. 15 ఏళ్ల కష్టం, సేవకు దక్కిన గౌరవం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాట శీను, సోంబాబు, గూడూరు శంకర్రావు, ఈశ్వరరావు, కేవీ రమణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని శ్రీనుకు అభినందనలు తెలిపారు.




