Monday, 31 August 2026
  • Home  
  • పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలపై జనసేనలో సమీక్ష సమావేశం
- విశాఖపట్నం

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలపై జనసేనలో సమీక్ష సమావేశం

విశాఖపట్నం జిల్లా, భీమిలి (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 31 :: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా భీమిలి నియోజకవర్గంలో నిర్వహించనున్న వివిధ సేవా, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్య సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల తెలిపారు. డాక్టర్ సందీప్ పంచకర్ల గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై చర్చించి, వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎండాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు మరియు మండల అధ్యక్షులు, మహిళా కో-ఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ సందీప్ పంచకర్ల కోరారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాఖపట్నం జిల్లా, భీమిలి (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 31 ::
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా భీమిలి నియోజకవర్గంలో నిర్వహించనున్న వివిధ సేవా, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్య సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల తెలిపారు.
డాక్టర్ సందీప్ పంచకర్ల గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై చర్చించి, వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎండాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు మరియు మండల అధ్యక్షులు, మహిళా కో-ఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ సందీప్ పంచకర్ల కోరారు.
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.