Thursday, 9 July 2026
  • Home  
  • 🔴 ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పథంలో ఆత్మకూరు.. చెర్లోయడవల్లిలో రూ.2 కోట్ల పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి ఆనం
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🔴 ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పథంలో ఆత్మకూరు.. చెర్లోయడవల్లిలో రూ.2 కోట్ల పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి ఆనం

ఆత్మకూరు, జులై 6(హరికిరణ్, పున్నమి ప్రతినిధి ) ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ జేజేలు, నినాదాలు, పూలవర్షం, హారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, ప్రజల ఆశీర్వాదమే తనకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.ఈ సందర్భంగా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, సీసీ రోడ్లు, పశువుల షెడ్లను ప్రారంభించడంతో పాటు శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఈ గ్రామానికి రాలేకపోయినా తనను రెండోసారి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఆశీర్వదించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఆలయాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఆదర్శం చెర్లోయడవల్లిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేవాదాయ శాఖ ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయగా, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా దాదాపు రూ.50 లక్షలు సమకూర్చి ఆలయాన్ని వైభవంగా అభివృద్ధి చేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తి, సేవాభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ వీరాంజనేయస్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.గ్రామంలో మరో ఆలయ నిర్మాణానికి ప్రజలు చేసిన విజ్ఞప్తిని కూడా ప్రస్తావించిన మంత్రి, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైతే నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు శాశ్వత ప్రయోజనం రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సోమశిల ఉత్తరపు కాలువ పొడిగింపు, 42ఆర్ కాలువ పనులు ఎన్నో సాంకేతిక, పరిపాలనా అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. మిగిలిన కాలువల పనులను కూడా దశలవారీగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. రెండేళ్లలో రూ.6,545 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సంక్షేమ కార్యక్రమాలకు రూ.3,461 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.3,084 కోట్లు వెచ్చించి మొత్తం రూ.6,545 కోట్ల విలువైన కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో కీలక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగామని చెప్పారు.పరిశ్రమలతో యువతకు ఉపాధివ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. రూ.67 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణాన్ని పూర్తి చేశామని, పరిశ్రమలకు అవసరమైన నీటి కోసం ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 23 పరిశ్రమలకు స్థలాలు కేటాయించామని, మరిన్ని పరిశ్రమలు త్వరలో ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసి పరిశ్రమలకు అందించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుస్థానిక యువతకు ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆత్మకూరులో అత్యాధునిక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు అందుబాటులో ఉండగా, ఈ కేంద్రం ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు.ఆత్మకూరు నియోజకవర్గాన్ని గ్రామీణాభివృద్ధి, సాగునీరు, విద్య, దేవాలయాల పునరుద్ధరణ, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఈడీ తాల్లూరి గిరినాయుడు, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సర్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. .

ఆత్మకూరు, జులై 6(హరికిరణ్, పున్నమి ప్రతినిధి )

ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ జేజేలు, నినాదాలు, పూలవర్షం, హారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, ప్రజల ఆశీర్వాదమే తనకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.ఈ సందర్భంగా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, సీసీ రోడ్లు, పశువుల షెడ్లను ప్రారంభించడంతో పాటు శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఈ గ్రామానికి రాలేకపోయినా తనను రెండోసారి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఆశీర్వదించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

ఆలయాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఆదర్శం

చెర్లోయడవల్లిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేవాదాయ శాఖ ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయగా, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా దాదాపు రూ.50 లక్షలు సమకూర్చి ఆలయాన్ని వైభవంగా అభివృద్ధి చేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తి, సేవాభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ వీరాంజనేయస్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.గ్రామంలో మరో ఆలయ నిర్మాణానికి ప్రజలు చేసిన విజ్ఞప్తిని కూడా ప్రస్తావించిన మంత్రి, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైతే నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు శాశ్వత ప్రయోజనం

రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సోమశిల ఉత్తరపు కాలువ పొడిగింపు, 42ఆర్ కాలువ పనులు ఎన్నో సాంకేతిక, పరిపాలనా అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. మిగిలిన కాలువల పనులను కూడా దశలవారీగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

రెండేళ్లలో రూ.6,545 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి

ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సంక్షేమ కార్యక్రమాలకు రూ.3,461 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.3,084 కోట్లు వెచ్చించి మొత్తం రూ.6,545 కోట్ల విలువైన కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో కీలక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగామని చెప్పారు.పరిశ్రమలతో యువతకు ఉపాధివ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. రూ.67 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణాన్ని పూర్తి చేశామని, పరిశ్రమలకు అవసరమైన నీటి కోసం ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 23 పరిశ్రమలకు స్థలాలు కేటాయించామని, మరిన్ని పరిశ్రమలు త్వరలో ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసి పరిశ్రమలకు అందించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుస్థానిక యువతకు ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆత్మకూరులో అత్యాధునిక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు అందుబాటులో ఉండగా, ఈ కేంద్రం ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు.ఆత్మకూరు నియోజకవర్గాన్ని గ్రామీణాభివృద్ధి, సాగునీరు, విద్య, దేవాలయాల పునరుద్ధరణ, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఈడీ తాల్లూరి గిరినాయుడు, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సర్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.