ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 5 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో మే 3వ తేదీ రాత్రి కురిసిన బీభత్స గాలివాన కారణంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు 33 కెవి లైన్లు తెగిపోవడం, 11 కెవి ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడం జరిగింది. ఈ ఘటనతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా మనుబోలు ఎలక్ట్రికల్ ఏఈ అనిల్ కుమార్ మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది పని చేసి అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు. ఇంకా మిగిలిన స్వల్ప పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.




