పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి బ్యూరో)
ఎలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రంలోని 123 అర్బన్ స్థానిక సంస్థల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఎలమంచిలి పట్టణంలో రూ.24 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. వీఎంఆర్డీఏ నిధుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ పనులతో పట్టణంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.
కార్యక్రమానికి ఏపీఆర్డీసీ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. డ్రైనేజీ, అంతర్గత రహదారులు, తాగునీటి వసతులు, పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నాయకులు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షుడు నానాజీ, జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు, బీజేపీ టౌన్ అధ్యక్షుడు శివ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.


