Tuesday, 29 September 2026
  • Home  
  • అరకు: ఘనంగా అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
- అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఎంతో కీలకమని, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, ప్రజాధనం వినియోగంపై అవగాహనతో పౌరులు తమ హక్కులు, బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలరని ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలిపారు. డాక్టర్ బి. సంధ్యారాణి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల, NSS P.O విజయలక్ష్మి, లెక్చరర్ భాస్కరరావు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు అధ్యక్షత వహించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఎంతో కీలకమని, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, ప్రజాధనం వినియోగంపై అవగాహనతో పౌరులు తమ హక్కులు, బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలరని ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలిపారు.

డాక్టర్ బి. సంధ్యారాణి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల, NSS P.O విజయలక్ష్మి, లెక్చరర్ భాస్కరరావు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.