Tuesday, 29 September 2026
  • Home  
  • భారీ ఉద్యోగ మేళాకు విశేష స్పందన
- అన్నమయ్య

భారీ ఉద్యోగ మేళాకు విశేష స్పందన

రైల్వే కోడూరు శ్రీ సాయి డిగ్రీ & పీజీ కళాశాలలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారు, ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉద్యోగ మేళాను శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకనాథం గారు, సులేమాన్ గారు, కాలేజీల ప్రిన్సిపల్స్ గారు,విద్యార్థులు హాజరైనారు, వివిధ విద్యార్హతలు కలిగిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ఉద్యోగ మేళా విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ భారీ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు, ప్రిన్సిపాల్ మరియు వారి స్టాప్, ఎన్డీయే కూటమి నాయుకులు పాల్కొన్నారు.

రైల్వే కోడూరు శ్రీ సాయి డిగ్రీ & పీజీ కళాశాలలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారు, ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉద్యోగ మేళాను శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకనాథం గారు, సులేమాన్ గారు, కాలేజీల ప్రిన్సిపల్స్ గారు,విద్యార్థులు హాజరైనారు,
వివిధ విద్యార్హతలు కలిగిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ఉద్యోగ మేళా విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ భారీ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు, ప్రిన్సిపాల్ మరియు వారి స్టాప్, ఎన్డీయే కూటమి నాయుకులు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.