Monday, 28 September 2026
  • Home  
  • దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి
- నంద్యాల

దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి

నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్(స్వాభిమాన్ ) ఏర్పాటు చేయాలని డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (DRWA/AP) వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి,అనంతపురం, మరియు అనేక జిల్లాలలో త్రివ్యాంగులకు ప్రతి నెల మూడవ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ( స్వాభిమాన్ ) కార్యక్రమం ఏర్పాటు చేసి దివ్యాంగుల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమస్యలను పరిష్కరిస్తున్నారని అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని దీనివల్ల నంద్యాల జిల్లా వ్యాప్తంగా దూర ప్రాంతాల నుండి దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలుంటుందని అలాగే నంద్యాల జిల్లాలో దివ్యాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ (AD)కార్యాలయాలు ఉండాలని, దీనివలన దివ్యాంగులకు సుదూర ప్రాంతాల ప్రయాణం చేయకుండా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం అవుతాయని ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఎడి కార్యాలయము 72 కిలోమీటర్లు దూరంలో ఉందని దివ్యాంగులు అక్కడికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గారికి మెమరాండం అందించారు.ఈ కార్యక్రమంలో డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సభ్యులు హుస్సేన్ వలి, వెంకటసుబ్బయ్య మరియు సాక్ష్యం సేవా కేంద్ర ప్రముక్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్(స్వాభిమాన్ )
ఏర్పాటు చేయాలని డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (DRWA/AP) వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి,అనంతపురం, మరియు అనేక జిల్లాలలో త్రివ్యాంగులకు ప్రతి నెల మూడవ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ( స్వాభిమాన్ ) కార్యక్రమం ఏర్పాటు చేసి దివ్యాంగుల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమస్యలను పరిష్కరిస్తున్నారని అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని దీనివల్ల నంద్యాల జిల్లా వ్యాప్తంగా దూర ప్రాంతాల నుండి దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలుంటుందని అలాగే నంద్యాల జిల్లాలో దివ్యాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ (AD)కార్యాలయాలు ఉండాలని, దీనివలన దివ్యాంగులకు సుదూర ప్రాంతాల ప్రయాణం చేయకుండా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం అవుతాయని ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఎడి కార్యాలయము 72 కిలోమీటర్లు దూరంలో ఉందని దివ్యాంగులు అక్కడికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గారికి మెమరాండం అందించారు.ఈ కార్యక్రమంలో డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సభ్యులు హుస్సేన్ వలి, వెంకటసుబ్బయ్య మరియు సాక్ష్యం సేవా కేంద్ర ప్రముక్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.