ఖమ్మం: రేబిస్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సూచించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన రేబిస్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుక్క కాటుకు గురైన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో శుభ్రం చేసి, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని తెలిపారు. అనుమానాస్పద కుక్కలకు దూరంగా ఉండాలని సూచించారు. రేబిస్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ ప్రధాన మార్గమని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ దివాకర్ టి ఎస్ కోరారు.



