విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండ.
తేజ డీవీఆర్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీలో సందడి.. కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు..
నందిగామ: నందిగామ పట్టణం మధిర ఆర్చి రోడ్డులోని తేజ డీవీఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు నూతనంగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే తత్వంతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు.. యువత అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే సౌమ్య గారు విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారిని ఉత్సాహపరిచారు.కార్యక్రమంలో కూటమి నేతలు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




