కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిద్దె తోటల విభాగంలో కాకినాడ జిల్లాకు చెందిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాల సభ్యులు విశేష ప్రతిభ కనబరిచారు.మిద్దె తోటల నిర్వహణలో కాకినాడ నగరపాలక సంస్థ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది.
విజయవాడలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన మహాలక్ష్మి మహిళా సమాఖ్య సభ్యురాలు టి. వెంకటలక్ష్మి,పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు సంచాలకురాలు కె. శైలజ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.
నగరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఇళ్ల మిద్దెలపై కూరగాయలు, ఆకుకూరలు తదితరాలను సాగు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడంలో మహిళా స్వయం సహాయక సంఘాలు చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.

*స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో కాకినాడ మహిళా సమాఖ్యకు రాష్ట్రస్థాయి అవార్డు* *మిద్దె తోటల నిర్వహణలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం**
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిద్దె తోటల విభాగంలో కాకినాడ జిల్లాకు చెందిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాల సభ్యులు విశేష ప్రతిభ కనబరిచారు.మిద్దె తోటల నిర్వహణలో కాకినాడ నగరపాలక సంస్థ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన మహాలక్ష్మి మహిళా సమాఖ్య సభ్యురాలు టి. వెంకటలక్ష్మి,పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు సంచాలకురాలు కె. శైలజ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. నగరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఇళ్ల మిద్దెలపై కూరగాయలు, ఆకుకూరలు తదితరాలను సాగు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడంలో మహిళా స్వయం సహాయక సంఘాలు చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.

