Saturday, 3 October 2026
  • Home  
  • *గాంధీ ఆశయాలే.. స్వచ్ఛ సమాజానికి మార్గదర్శకం* *సత్యం, అహింస, స్వచ్ఛత, సేవాభావాన్ని ఆచరించాలి* *కేఎంసీ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*గాంధీ ఆశయాలే.. స్వచ్ఛ సమాజానికి మార్గదర్శకం* *సత్యం, అహింస, స్వచ్ఛత, సేవాభావాన్ని ఆచరించాలి* *కేఎంసీ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం,అహింస,శాంతి, స్వచ్ఛత,సేవాభావం వంటి విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.గాంధీజీ చాటిచెప్పిన నిరాడంబరత, నిజాయితీ,దేశభక్తి వంటి ఉన్నత ఆదర్శాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్‌ మేనేజర్‌ శిరీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ,విశిష్ట అతిథిగా అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌ హాజరయ్యారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపించి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు.సత్యం,అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం, సామాజిక సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలు సర్వకాలాల్లోనూ ఆచరణీయమని పేర్కొన్నారు. స్వచ్ఛతకు గాంధీజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన కలలుగన్న పరిశుభ్రమైన సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్‌ తెలిపారు. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రజలు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి రోజుల్లో స్మరించుకోవడం కాకుండా, నిత్య జీవితంలో ఆచరించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పృద్వీ చరణ్‌, ఈఈ కనకారావు,అకౌంటెంట్‌ జయరాం,కార్పొరేషన్‌ అధికారులు,ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం,అహింస,శాంతి, స్వచ్ఛత,సేవాభావం వంటి విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.గాంధీజీ చాటిచెప్పిన నిరాడంబరత, నిజాయితీ,దేశభక్తి వంటి ఉన్నత ఆదర్శాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్‌ మేనేజర్‌ శిరీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ,విశిష్ట అతిథిగా అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌ హాజరయ్యారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపించి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు.సత్యం,అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం, సామాజిక సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలు సర్వకాలాల్లోనూ ఆచరణీయమని పేర్కొన్నారు.
స్వచ్ఛతకు గాంధీజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన కలలుగన్న పరిశుభ్రమైన సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్‌ తెలిపారు. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రజలు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి రోజుల్లో స్మరించుకోవడం కాకుండా, నిత్య జీవితంలో ఆచరించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పృద్వీ చరణ్‌, ఈఈ కనకారావు,అకౌంటెంట్‌ జయరాం,కార్పొరేషన్‌ అధికారులు,ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి Cinemaలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.