Saturday, 3 October 2026
  • Home  
  • ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం ఇబ్రహీంపట్నం
- ఎన్ టి ఆర్ జిల్లా

ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం ఇబ్రహీంపట్నం

*ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ప్రారంభం* *ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 2,* ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో యువత కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన *ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం* మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలు యువత చదువును, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, వాటికి అలవాటు పడకుండా చదువుపై, కంప్యూటర్ పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రేస్ మినిస్ట్రీస్ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా నుండి వచ్చిన *లిండ్సే మరియు అలెక్స్* మాట్లాడుతూ ప్రపంచమంతా టెక్నాలజీలో ఎంతో ముందుకు వెళుతోందని, యువత కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం ఎంతో అవసరమని అన్నారు. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ *ఎలీషా* మాట్లాడుతూ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఎన్నో సామాజిక కార్యక్రమాలలో భాగంగా యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నామని, యువత చెడు వ్యసనాలను విడిచి మంచి క్రమశిక్షణతో ఈ కేంద్రంలో శ్రద్ధగా నేర్చుకుని టెక్నాలజీలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కేంద్రంలో 10 కంప్యూటర్లను, ఒక టీచర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్సై *సన్యాసినాయుడు*, గ్రేస్ మినిస్ట్రీస్ సెక్రటరీ *సుమలత*, బెరాక మినిస్ట్రీస్ పాస్టర్ *పాల్*,అనిల్,యోహాను,నాగరాజు,గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

*ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ప్రారంభం*

*ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 2,*

ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో యువత కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన *ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం* మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలు యువత చదువును, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, వాటికి అలవాటు పడకుండా చదువుపై, కంప్యూటర్ పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రేస్ మినిస్ట్రీస్ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అమెరికా నుండి వచ్చిన *లిండ్సే మరియు అలెక్స్* మాట్లాడుతూ ప్రపంచమంతా టెక్నాలజీలో ఎంతో ముందుకు వెళుతోందని, యువత కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం ఎంతో అవసరమని అన్నారు.

గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ *ఎలీషా* మాట్లాడుతూ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఎన్నో సామాజిక కార్యక్రమాలలో భాగంగా యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నామని, యువత చెడు వ్యసనాలను విడిచి మంచి క్రమశిక్షణతో ఈ కేంద్రంలో శ్రద్ధగా నేర్చుకుని టెక్నాలజీలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కేంద్రంలో 10 కంప్యూటర్లను, ఒక టీచర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్సై *సన్యాసినాయుడు*, గ్రేస్ మినిస్ట్రీస్ సెక్రటరీ *సుమలత*, బెరాక మినిస్ట్రీస్ పాస్టర్ *పాల్*,అనిల్,యోహాను,నాగరాజు,గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.