Saturday, 3 October 2026
  • Home  
  • *బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలతో అడ్డుకుంటున్నారు: జ్యోతుల నవీన్ కుమార్*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలతో అడ్డుకుంటున్నారు: జ్యోతుల నవీన్ కుమార్*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకూడదనే కుట్రతోనే వైసీపీ (గొడ్డలి పార్టీ) నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ధ్వజమెత్తారు.బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో నెం.105, 1065 జారీ చేస్తే.. వెంటనే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఆ పార్టీ నేతలేనని ఆయన మండిపడ్డారు. ​అసలు రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని, ఒకవేళ జరిగినా బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతోనే వాళ్లు ఇలా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏకంగా 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని, ఇప్పుడు కూడా వారికి ఆ పదవులు రాకూడదన్న కుట్రతోనే సిగ్గులేకుండా కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ​బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే ఎక్కడ వారి రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందో అన్న భయంతోనే న్యాయస్థానంలో పిటిషన్లు వేసి అడ్డుపడుతున్నారని, ఇది బీసీలకు చేస్తున్న తీరని ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే అజెండాతోనే వారు ఈ విధంగా అడ్డుతగులుతున్నారని దుయ్యబట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటే, గొడ్డలి పార్టీ నేతలు మాత్రం ఇలా కుట్రలు చేస్తూ అడ్డుపడుతున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా చూడాలనే కుట్రతోనే ఇలా అడ్డుకునే నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ​ఎంతమంది అడ్డుకున్నా వెనక్కి తగ్గేది లేదు.. ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా.. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే, బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలన్న తమ సంకల్పం నెరవేరే వరకు పోరాడుతామన్నారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం తాము ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితమే 1987లో 20%, 1995లో 34% రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర తమదని, బీసీల రాజకీయ సాధికారత అనేది టీడీపీ డీఎన్ఏ లోనే ఉందని నవీన్ కుమార్ ఉద్ఘాటించారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకూడదనే కుట్రతోనే వైసీపీ (గొడ్డలి పార్టీ) నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ధ్వజమెత్తారు.బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో నెం.105, 1065 జారీ చేస్తే.. వెంటనే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఆ పార్టీ నేతలేనని ఆయన మండిపడ్డారు.
​అసలు రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని, ఒకవేళ జరిగినా బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతోనే వాళ్లు ఇలా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏకంగా 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని, ఇప్పుడు కూడా వారికి ఆ పదవులు రాకూడదన్న కుట్రతోనే సిగ్గులేకుండా కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటున్నారని విమర్శించారు.
​బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే ఎక్కడ వారి రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందో అన్న భయంతోనే న్యాయస్థానంలో పిటిషన్లు వేసి అడ్డుపడుతున్నారని, ఇది బీసీలకు చేస్తున్న తీరని ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే అజెండాతోనే వారు ఈ విధంగా అడ్డుతగులుతున్నారని దుయ్యబట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటే, గొడ్డలి పార్టీ నేతలు మాత్రం ఇలా కుట్రలు చేస్తూ అడ్డుపడుతున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా చూడాలనే కుట్రతోనే ఇలా అడ్డుకునే నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
​ఎంతమంది అడ్డుకున్నా వెనక్కి తగ్గేది లేదు..
ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా.. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే, బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలన్న తమ సంకల్పం నెరవేరే వరకు పోరాడుతామన్నారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం తాము ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితమే 1987లో 20%, 1995లో 34% రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర తమదని, బీసీల రాజకీయ సాధికారత అనేది టీడీపీ డీఎన్ఏ లోనే ఉందని నవీన్ కుమార్ ఉద్ఘాటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.