Monday, 1 June 2026
  • Home  
  • స్వచ్ఛ, పవిత్ర గోదావరి పుష్కరాలే పవన్ కళ్యాణ్ లక్ష్యం: పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు
- News

స్వచ్ఛ, పవిత్ర గోదావరి పుష్కరాలే పవన్ కళ్యాణ్ లక్ష్యం: పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు

విశాఖపట్నం జూన్1(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్): కాలుష్య రహిత గోదావరి నదిలో భక్తులు పుష్కరాల సందర్భంగా స్నాన మాచరించి పవిత్రమైన పుష్కర కార్యక్రమాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణదెల పవన్ కళ్యాణ్ సంకల్పించా మరని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం సుజాతనగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గౌరవ ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు రాజమండ్రిలో పర్యటించి గోదావరి పుష్కర ఏర్పాట్లు పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నుండి గోదావరి పరివాహక ప్రాంత కోసం రూ.100 కోట్ల ర నిధులు మంజూరు చేయించారన్నారు. గోదావరి తీరంలో ఆరు జిల్లాల పరిధిలో గల 262 పంచాయతీలను గుర్తించి, వాటిని పుష్కరాలు నాటికి పూర్తిస్థాయి మురుగు రహిత, కాలుష్య రహిత పంచాయతీలుగా తీర్చి దిద్దనున్నారని చెప్పారు‌. మురుగు నీరు వ్యర్ధాలు గోదావరిలో కలవకుండా పగడబందీగా చర్యలు తీసు కుంటున్నారని, పుష్కరాలకు వచ్చే కోట్లాదిమంది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి నదీ జలాలను పరిశుభ్రంగా పరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించ నున్నారని తెలిపారు. గోదావరి నది మన సంస్కృతికి, మన వైభవానికి మరియు మన పవిత్ర జీవనానికి చిహ్నమని, పుష్కరాల సమయంలో ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదని గోదావరి పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారన్నారు. నపి సి బి నుండి రూ.100 కోట్లు తక్షణమే విడుదల అయ్యాయని, ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు గోదావరి పరిహారక ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నదులు, చెరువులు స్వచ్ఛతపై ప్రభుత్వం దృష్టి సాధించిందని, పెందుర్తి నియోజక వర్గంలో కూడా డ్రైనేజీ వ్యవస్థను మురుగుపరిచి వ్యర్థ జలాలను స్థానిక వాగుల్లో కలవకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నది జలాల పరిరక్షణ పవన్ కళ్యాణ్ గారి మొదటి ప్రాధాన్యత అని గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్ రహితంగా కాలుష్య రహితంగా నిర్వహించేందుకు ప్రతి జనసైనికుడు ప్రతి పౌరుడు సహకరించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కోరారు. కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రామా నాయుడు, పెందుర్తి మండల పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం, పెందుర్తి ఏఎంసి వైస్ చైర్మన్ గోరపిల్లి సోమనాయుడు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ నీటిపల్లి మహేష్, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు, లక్కీ గోవింద్, మండల సీనియర్ నాయకులు గండ్రెడ్డి నగేష్, అయిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జూన్1(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్): కాలుష్య రహిత గోదావరి నదిలో భక్తులు పుష్కరాల సందర్భంగా స్నాన మాచరించి పవిత్రమైన పుష్కర కార్యక్రమాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణదెల పవన్ కళ్యాణ్ సంకల్పించా మరని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం సుజాతనగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గౌరవ ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు రాజమండ్రిలో పర్యటించి గోదావరి పుష్కర ఏర్పాట్లు పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నుండి గోదావరి పరివాహక ప్రాంత కోసం రూ.100 కోట్ల ర
నిధులు మంజూరు చేయించారన్నారు. గోదావరి తీరంలో ఆరు జిల్లాల పరిధిలో గల 262 పంచాయతీలను గుర్తించి, వాటిని పుష్కరాలు నాటికి పూర్తిస్థాయి మురుగు రహిత, కాలుష్య రహిత పంచాయతీలుగా తీర్చి దిద్దనున్నారని చెప్పారు‌. మురుగు నీరు వ్యర్ధాలు గోదావరిలో కలవకుండా పగడబందీగా చర్యలు తీసు కుంటున్నారని, పుష్కరాలకు వచ్చే కోట్లాదిమంది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి నదీ జలాలను పరిశుభ్రంగా పరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించ నున్నారని తెలిపారు. గోదావరి నది మన సంస్కృతికి, మన వైభవానికి మరియు మన పవిత్ర జీవనానికి చిహ్నమని, పుష్కరాల సమయంలో ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదని గోదావరి పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారన్నారు. నపి సి బి నుండి రూ.100 కోట్లు తక్షణమే విడుదల అయ్యాయని, ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు గోదావరి పరిహారక ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నదులు, చెరువులు స్వచ్ఛతపై ప్రభుత్వం దృష్టి సాధించిందని, పెందుర్తి నియోజక వర్గంలో కూడా డ్రైనేజీ వ్యవస్థను మురుగుపరిచి వ్యర్థ జలాలను స్థానిక వాగుల్లో కలవకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నది జలాల పరిరక్షణ పవన్ కళ్యాణ్ గారి మొదటి ప్రాధాన్యత అని గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్ రహితంగా కాలుష్య రహితంగా నిర్వహించేందుకు ప్రతి జనసైనికుడు ప్రతి పౌరుడు సహకరించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కోరారు. కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రామా నాయుడు, పెందుర్తి మండల పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం, పెందుర్తి ఏఎంసి వైస్ చైర్మన్ గోరపిల్లి సోమనాయుడు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ నీటిపల్లి మహేష్, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు, లక్కీ గోవింద్, మండల సీనియర్ నాయకులు గండ్రెడ్డి నగేష్, అయిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.