గాజువాక, (పున్నమి ప్రతినిధి): దివంగత డాక్టర్ కె.వి. రామన్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గాజువాక సాయిరామ్ నగర్‌లో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసి నివాళులర్పించారు.
ట్రస్ట్ ప్రతినిధులు జమునారాణి, డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్ మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే డాక్టర్ రామన్ ఆశయమని, అదే లక్ష్యంతో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
కార్యక్రమంలో వైసీపీ నేత గౌస్, మౌనిక, బాలు, ఆసుపత్రి సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.




