Tuesday, 18 August 2026
  • Home  
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 34 కాదు.. 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 కాదు.. 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

*సీఎం చంద్రబాబుకు బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి *ఎన్టీఆర్ స్ఫూర్తితో బీసీలకు న్యాయం చేయాలి *బీసీల కలలకు రెక్కలు తొడగాలి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కాకుండా 43 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయాలని బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కార్యదర్శి, రాష్ట్ర బీసీ నేత ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది బీసీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి బీసీలు ఆ పార్టీ వెంటే నడుస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తుచేశారు. అందుకు కృతజ్ఞతగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అనే పరిమితిని దాటి, 43 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని** కోరారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ, ఆ శాతానికి మరో ఒక శాతం కలిపి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన సమయంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా బీసీలు కోరుకుంటున్నారని తెలిపారు. బీసీల కలలకు రెక్కలు తొడగడం, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం”అని సంపత్ రాజు పేర్కొన్నారు. బీసీల ఆశయాలను సాకారం చేస్తే రాష్ట్రంలోని బీసీలంతా చంద్రబాబు నాయకత్వం వైపు ఏకతాటిపై నడిచే అవకాశం ఉంటుందని అన్నారు. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 43 శాతం రిజర్వేషన్లపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు.

*సీఎం చంద్రబాబుకు బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి
*ఎన్టీఆర్ స్ఫూర్తితో బీసీలకు న్యాయం చేయాలి
*బీసీల కలలకు రెక్కలు తొడగాలి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కాకుండా 43 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయాలని బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కార్యదర్శి, రాష్ట్ర బీసీ నేత ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది బీసీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి బీసీలు ఆ పార్టీ వెంటే నడుస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తుచేశారు. అందుకు కృతజ్ఞతగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అనే పరిమితిని దాటి, 43 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని** కోరారు.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ, ఆ శాతానికి మరో ఒక శాతం కలిపి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన సమయంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా బీసీలు కోరుకుంటున్నారని తెలిపారు.
బీసీల కలలకు రెక్కలు తొడగడం, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం”అని సంపత్ రాజు పేర్కొన్నారు.

బీసీల ఆశయాలను సాకారం చేస్తే రాష్ట్రంలోని బీసీలంతా చంద్రబాబు నాయకత్వం వైపు ఏకతాటిపై నడిచే అవకాశం ఉంటుందని అన్నారు. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 43 శాతం రిజర్వేషన్లపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.