గుంటూరు, సెప్టెంబరు 11 (పున్నమి ప్రతినిధి): గుంటూరులో నిర్వహించిన బీజేపీ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నాహకాలపై నేతలు చర్చించారు.



