Tuesday, 18 August 2026
  • Home  
  • సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ భద్రతా చర్యలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ భద్రతా చర్యలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ భద్రతా చర్యలు ఖాజాగూడ డిపిఎస్  మరియు మల్కంచెరువు ప్రాంతాలలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్ ఆకస్మిక తనిఖీ సైబరాబాద్ కమ్యూనిటీకి మెరుగైన, సురక్షితమైన ట్రాఫిక్ వ్యవస్థను అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సున్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్  సోమవారం ఖాజాగూడ మరియు మల్కంచెరువు ప్రాంతాలలో పర్యటించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ( డిపిఎస్ ) వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ప్రతిపాదిత నూతన యూ-టర్న్ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. కీలక ఆదేశాలు మరియు సూచనలు: కొత్త యూ-టర్న్ ఏర్పాటు: ఖాజాగూడ డి పి ఎస్  వద్ద ప్రస్తుతం ఉన్న పాత యూ-టర్న్‌ను పూర్తిగా మూసివేసి, దానికంటే సుమారు 70 మీటర్ల ముందుగా కొత్త యూ-టర్న్‌ను ఏర్పాటు చేయాలని అడీసీపీ ట్రాఫిక్ (శేరిలింగంపల్లి), ఏసిపి మాదాపూర్ ట్రాఫిక్, మరియు ఎస్ హెచ్ ఓ  రాయదుర్గం ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, వాహనదారులు రాంగ్ రూట్‌లో (తప్పు మార్గంలో) ప్రయాణించడాన్ని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. మల్కంచెరువు హైటెన్షన్ రోడ్డు పరిశీలన: అనంతరం మల్కంచెరువు వెనుక వైపు ఉన్న హైటెన్షన్ రోడ్డును సందర్శించి ట్రాఫిక్ రద్దీని సమీక్షించారు. తక్కువ దూరంలోనే రెండు యూ-టర్న్‌లు ఉండటం వల్ల వాహనాల రాకపోకల్లో గందరగోళం ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో, అతి తక్కువ దూరంలో ఉన్న ఆ రెండు యూ-టర్న్‌లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి మరియు వాహనాల సజావు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ భద్రతా చర్యలు

ఖాజాగూడ డిపిఎస్  మరియు మల్కంచెరువు ప్రాంతాలలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్ ఆకస్మిక తనిఖీ
సైబరాబాద్ కమ్యూనిటీకి మెరుగైన, సురక్షితమైన ట్రాఫిక్ వ్యవస్థను అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సున్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్  సోమవారం ఖాజాగూడ మరియు మల్కంచెరువు ప్రాంతాలలో పర్యటించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ( డిపిఎస్ ) వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ప్రతిపాదిత నూతన యూ-టర్న్ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
కీలక ఆదేశాలు మరియు సూచనలు:
కొత్త యూ-టర్న్ ఏర్పాటు: ఖాజాగూడ డి పి ఎస్  వద్ద ప్రస్తుతం ఉన్న పాత యూ-టర్న్‌ను పూర్తిగా మూసివేసి, దానికంటే సుమారు 70 మీటర్ల ముందుగా కొత్త యూ-టర్న్‌ను ఏర్పాటు చేయాలని అడీసీపీ ట్రాఫిక్ (శేరిలింగంపల్లి), ఏసిపి మాదాపూర్ ట్రాఫిక్, మరియు ఎస్ హెచ్ ఓ  రాయదుర్గం ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, వాహనదారులు రాంగ్ రూట్‌లో (తప్పు మార్గంలో) ప్రయాణించడాన్ని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు.
మల్కంచెరువు హైటెన్షన్ రోడ్డు పరిశీలన: అనంతరం మల్కంచెరువు వెనుక వైపు ఉన్న హైటెన్షన్ రోడ్డును సందర్శించి ట్రాఫిక్ రద్దీని సమీక్షించారు. తక్కువ దూరంలోనే రెండు యూ-టర్న్‌లు ఉండటం వల్ల వాహనాల రాకపోకల్లో గందరగోళం ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో, అతి తక్కువ దూరంలో ఉన్న ఆ రెండు యూ-టర్న్‌లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి మరియు వాహనాల సజావు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.