Thursday, 24 September 2026
  • Home  
  • సేవా స్ఫూర్తికి గుర్తింపు.. కాపు జేఏసీలో మణికుమార్‌కు కీలక పదవి
- తూర్పు గోదావరి

సేవా స్ఫూర్తికి గుర్తింపు.. కాపు జేఏసీలో మణికుమార్‌కు కీలక పదవి

రాష్ట్ర కమ్యూనిటీ వెల్ఫేర్ యూత్ అధ్యక్షుడిగా నియామకం తూర్పు గోదావరి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు ఐక్య కార్యాచరణ సమితి (కాపు జేఏసీ) రాష్ట్ర కమ్యూనిటీ వెల్ఫేర్ యూత్ అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, మణి అన్న బ్లడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు పెంటగట్ల మణికుమార్ నియమితులయ్యారు. కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత కొన్నేళ్లుగా రక్తదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మణికుమార్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా మణికుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రతి రోజు మనకోసం.. ఒక రోజు జాతి అభివృద్ధి కోసం” అనే నినాదంతో కాపు జాతి ఐక్యత, యువత చైతన్యం కోసం కృషి చేస్తానన్నారు. మణికుమార్ నియామకంపై కాపు నాయకులు, యువత హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర కమ్యూనిటీ వెల్ఫేర్ యూత్ అధ్యక్షుడిగా నియామకం

తూర్పు గోదావరి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు ఐక్య కార్యాచరణ సమితి (కాపు జేఏసీ) రాష్ట్ర కమ్యూనిటీ వెల్ఫేర్ యూత్ అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, మణి అన్న బ్లడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు పెంటగట్ల మణికుమార్ నియమితులయ్యారు. కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గత కొన్నేళ్లుగా రక్తదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మణికుమార్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు చైర్మన్ తెలిపారు.

ఈ సందర్భంగా మణికుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రతి రోజు మనకోసం.. ఒక రోజు జాతి అభివృద్ధి కోసం” అనే నినాదంతో కాపు జాతి ఐక్యత, యువత చైతన్యం కోసం కృషి చేస్తానన్నారు. మణికుమార్ నియామకంపై కాపు నాయకులు, యువత హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.