తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించారని ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కుటుంబ సభ్యులు టీవీకే పార్టీకి ఓటు వేయాలని పిల్లలను కోరడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో పిల్లలు పెద్దలను ప్రభావితం చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. అలాగే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు డబ్బు పంచిన ఆరోపణలపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై ఎన్నికల సంఘం స్పందన ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది.

సీఎం విజయ్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్