సామాజిక సామరస్యతకు ప్రతీక సంత్ గురు రవిదాస్ మహారాజ్ అని బిజెపి ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈ సందర్భంగా భీమిని మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిజెపి కార్యకర్త నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంత్ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా దేశవ్యాప్తంగా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు.అందులో భాగంగానే వారి జన్మస్థలం కాశి దగ్గరలోని సీర్ గోవర్ధనపూర్ నుండి మట్టిని సేకరించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మండలాలకు రథయాత్ర ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.సమానత్వం, సామాజిక న్యాయం, మానవత్వం, భక్తి మార్గాలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు సంత్ గురు రవిదాస్ మహారాజ్ అని అన్నారు.సంత్ గురు రవిదాస్ మహారాజ్ కుల, మత, వర్గ వివక్షలకు అతీతంగా ప్రతి మనిషి సమానుడనే గొప్ప సందేశాన్ని సమాజానికి అందించారు.ప్రేమ, సోదరభావం, సేవా తత్వం, నిజాయితీతో కూడిన జీవన విధానాన్ని ఆయన బోధించారు.సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అన్నారు. ఆయన బోధనలు నేటికీ సమానత్వం, సామాజిక సామరస్యం, మానవ విలువలను పెంపొందించే మార్గదర్శకాలుగా నిలిచాయని అన్నారు.భారత యువత ఆయన ఆదర్శాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంత్ గురు రవిదాస్ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం,సామాజిక న్యాయం,మానవ గౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు కొంక సత్యనారాయణ,మండల ప్రధాన కార్యదర్శి ముత్యం పురుషోత్తం గౌడ్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బత్తని రమేష్ గౌడ్,యువ మోర్చా మలిశెట్టి లచ్చన్న,నాయకులు బత్తని బాపు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సమరసతకు ప్రతీక సంత్ గురు రవిదాస్ మహారాజ్..