Thursday, 16 April 2026
  • Home  
  • ఆధునికాంధ్ర పితామహుడు – డా. బద్రి పీర్ కుమార్
- సాహితీ

ఆధునికాంధ్ర పితామహుడు – డా. బద్రి పీర్ కుమార్

తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న జరుపుకుంటాము. ఆధునిక తెలుగు నాటకరంగ పితామహుడు, తొలి నాటకకర్త, దర్శకుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని, 2007 నుండి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుతారు. గొప్ప సంఘ సంస్కర్త, మూఢనమ్మకాలపై యుద్దంప్రకటించిన కలియుగ వైతాళికుడు, బాల్యవివాహాల రద్దుకోసం ఉద్యమించిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఆధునిక సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహా పురుషుడు. వితంతు వివాహాల కోసం పోరాడి, 1881లో మొదటి వితంతు వివాహాన్ని జరిపించి, తెలుగులో మొదటి నవల ‘రాజశేఖర చరిత్రము’ మొదటి స్వీయచరిత్ర, మొదటి ప్రహసనం రాసి బాలికల కోసం పాఠశాలలను స్థాపించి, స్త్రీ విద్యకు, సాధికారతకు కృషి చేశారు. ‘వివేకవర్ధిని’ పత్రిక ద్వారా సమాజంలోని దురాచారాలపై పోరాటం చేయుట వలన, సంఘ సంస్కరణలు మరియు సాహిత్య సేవ కారణంగా ‘ఆధునికాంధ్ర సమాజ పితామహుడు’ గా, ‘గద్య తిక్కన’ గా పేరుపొందిన వీరేశలింగం గారికి ఈ అక్షర సుమాంజలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.