Saturday, 25 April 2026
  • Home  
  • వైసీపీ కార్యకర్త బందువుకి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
- తిరుపతి

వైసీపీ కార్యకర్త బందువుకి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 25 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరేంద్ర మామ శనివారం ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని కలిగించింది. విషయం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మృతుని నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నరేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీవారి సురేష్, కంటా ఉదయ్ కుమార్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి వారు తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.