శ్రీకాళహస్తి, ఏప్రిల్ 25 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పట్టణంలోని బ్లూమింగ్ బడ్స్ ప్రీ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ కె. మనోహర్, ప్రిన్సిపల్ డా. గీతా దేవి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెడికల్ ఆఫీసర్ రామారావు, జీఎస్టీ అధికారి రాఘవులు, హైకోర్టు అడ్వకేట్ రవికుమార్ హాజరై చిన్నారులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిని సాధించాలన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నృత్యాలు, పాటలు, నాటికలతో తమ ప్రతిభను చాటుకున్న చిన్నారులకు అతిథులు ప్రశంసలు కురిపించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు ప్రదానం చేసి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చిన్నారులు విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వైభవంగా బ్లూమింగ్ బడ్స్ ప్రీ స్కూల్ వార్షికోత్సవం- చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు