*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ఆగస్టు 12 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
నాయుడుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులువేనుంబాక విజయశేఖర్ రెడ్డి, వేనుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పులివెందుల సంజీవయ్య స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.వైసీపీ నేత వేణుంబాక విజయ శేఖర్ రెడ్డి మాతృమూర్తి మంగళవారం సాయంత్రంకన్నుమూశారు.సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బుధవారం నాయుడుపేటలోని వారి స్వగృహానికి వెళ్లి, పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరంవారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవ రెడ్డి వైసీపీ ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి,నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఈదా రత్నశ్రీ,దొరవారిసత్రం మండలఅధ్యక్షులు,అల్లూరి రాహుల్ రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పాలేటి నాగార్జున, క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు భావన్ అనుదీప్,నాయకులు రాయపు శేఖర్,లక్ష్మీ ప్రసన్న, కన్మని,తదితరులు వేణుంభాక బ్రదర్స్ ను పరామర్శించారు



