విస్ఠం స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
కడప జిల్లా నందలూరు మండలం గురజాడనగర్ లోని విజం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రాధా ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించి వేడుకలను ప్రారంభించారు. WHRC ఆధ్వర్యంలో విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కరస్పాండెంట్ రాధాతో పాటు ఉపాధ్యాయులు అనురాధ, పుష్పలత, షాను, జుబేరియా, ఫర్హానా, కవిత, హరి శివ కుమార్లకు ‘ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు’ మరియు షీల్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో WHRC రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్, సయ్యద్ మెహతాజ్ బేగం, సయ్యద్ జుల్ఫికర్, వరప్రసాద్ తదితరులు పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు


