మాధవరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలోని హ్యాపీ కిడ్స్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లి జన్మనిస్తే, తండ్రి నడక నేర్పుతారని, జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని, గురువును పూజించడం ముల్లోకాల పూజతో సమానమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


