విజయనగరం: జిల్లాలో గురువారం ఉదయం 4 గంటల వరకు భారీ వర్షాలు కురిశాయి. అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం కొత్తవలస మండలంలో అత్యధికంగా 135.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. బొబ్బిలిలో అత్యల్పంగా 20.2 మి.మీ. నమోదైంది.
ఎల్.కోట 98.2, ఎస్.కోట 79.2, సంతకవిటి 68.6, గంట్యాడ 68.0, మెరకముడిదాం 67.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 27 మండలాల్లో వర్షాలు కురిశాయి.


