ఏర్పేడు, జులై 26, (పున్నమి న్యూస్): ఏర్పేడులో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో వెలసిన శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారిని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దండి నరేంద్ర దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన అభిషేకం, వేద పారాయణం, ఏకాంత సేవ వంటి విశిష్ట పూజల్లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ పసుపులేటి, వారి కుటుంబ సభ్యులు, వేద పండితులు, స్థానిక భక్తులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలు, రైతుల సంక్షేమం, ప్రజా సుభిక్షం, ప్రకృతి పరిరక్షణను కాంక్షిస్తూ స్వామివారిని ప్రార్థించినట్లు దండి నరేంద్ర తెలిపారు. ఆలయ కోనేరు నిర్మాణంతో పాటు భవిష్యత్తులో వికృతమాలను భావి తరాలకు ‘మినీ తిరుమల’గా తీర్చిదిద్దాలనే డాక్టర్ హరిప్రసాద్ పసుపులేటి సేవా సంకల్పం ఎంతో ఆదర్శప్రాయమని ప్రశంసించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జనసేన నాయకులు కావలి మునికుమార్, పూల శివశంకర్, మురళి, శ్రీనివాస్, సుధాకర్, లోకేష్, జయశంకర్, దివాకర్, రాఘవ, రాజేష్, ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల జనసైనికులు పాల్గొన్నారు.

వికృతమాల వెంకటేశ్వర స్వామి సేవలో దండి నరేంద్ర