శ్రీ కాళహస్తి, జులై 26, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పదవ రోజు ఆదివారం నాడు అత్యంత వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సాయంత్రం వేళ భక్తులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసే చారిత్రాత్మక ఘట్టం ‘దుర్యోధన దుశ్శాసన వధ’ కార్యక్రమాన్ని ఆలయ వీధిలో కనులపండువగా నిర్వహించారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా సాగిన ఈ పౌరాణిక నాటక ఘట్టాన్ని వీక్షించేందుకు నియోజకవర్గ నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ విశిష్ట ఆధ్యాత్మిక వేడుకలో శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డు చైర్మన్, కార్యనిర్వహణాధికారి (ఈవో), ధర్మరాజు స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్, సభ్యులు, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్ల కృపాకటాక్షాలు పొందారు.

ధర్మరాజుల బ్రహ్మోత్సవాల్లో ఉత్కంఠభరితంగా దుర్యోధన వధ ఘట్టం