శ్రీ కాళహస్తి, జులై 26, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పదవ రోజు ఆదివారం నాడు భక్తుల కోలాహలం, జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు ఎంతో పవిత్రంగా, ఉత్కంఠభరితంగా ఎదురుచూసే ప్రధాన ఘట్టం ‘అగ్నిగుండ ప్రవేశం’ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహత్కార్యంలో నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన బోర్డు చైర్మన్, కార్యనిర్వహణాధికారి (ఈవో), పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, ధర్మరాజు స్వామి గుడి పాలకమండలి చైర్మన్, సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు దైవ నామస్మరణ చేస్తూ ఎంతో నియమ నిష్టలతో అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు ముందస్తుగా మెరుగైన భద్రతా వసతులు, సేవా ఏర్పాట్లు చేయడంతో ఈ ఆధ్యాత్మిక వేడుక అత్యంత విజయవంతంగా ముగిసింది.

శ్రీకాళహస్తిలో వైభవంగా ధర్మరాజుల స్వామి ఆలయ అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం