శ్రీ కాళహస్తి, జులై 26, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన కైకలూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ ఆరోగ్య, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖల మంత్రి కామినేని శ్రీనివాసరావుకు ఆలయ అతిథి గృహం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు బీజేపీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రవేశించిన ఆయన.. రాహు-కేతువుల ప్రత్యేక పూజల్లో పాల్గొని, శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మరియు స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు కామినేని శ్రీనివాసరావుకు స్వామి, అమ్మవార్ల పవిత్ర చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను బహూకరించి ఘనంగా సత్కరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముక్కంటి సేవలో కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని