Sunday, 2 August 2026
  • Home  
  • లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.. ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయండి: సీఐటీయూ
- రాజన్న సిరిసిల్ల

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.. ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయండి: సీఐటీయూ

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 1 (పున్నమి ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన లేబర్ కోడ్స్ సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టులాంటివని సీడబ్ల్యూఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి అన్నారు. 300 మంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ముందస్తు నోటీసు లేకుండానే కార్మికులను తొలగించే అవకాశం కల్పించడం ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుందన్నారు. వ్యవసాయ బోరుబావులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం రైతులపై అదనపు భారం మోపే చర్య అని విమర్శించారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన నిర్మాణ, హమాలీ, బీడీ, వ్యవసాయ, సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ ఐక్యంగా పోరాడి ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 1 (పున్నమి ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన లేబర్ కోడ్స్ సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టులాంటివని సీడబ్ల్యూఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి అన్నారు. 300 మంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ముందస్తు నోటీసు లేకుండానే కార్మికులను తొలగించే అవకాశం కల్పించడం ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుందన్నారు. వ్యవసాయ బోరుబావులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం రైతులపై అదనపు భారం మోపే చర్య అని విమర్శించారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన నిర్మాణ, హమాలీ, బీడీ, వ్యవసాయ, సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ ఐక్యంగా పోరాడి ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.