నెల్లూరు నగరంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. మద్రాస్ బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన మార్కింగ్ పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాలువల పూడిక తొలగింపు, పరిశుభ్రత నిర్వహణ కూడా సమర్థవంతంగా జరగాలని సూచించారు. నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

రోడ్ల విస్తరణ పనుల సమీక్ష | వై.ఓ నందన్.