Friday, 28 August 2026
  • Home  
  • *రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం ఐదుగురికి తీవ్ర గాయాలు*
- విశాఖపట్నం

*రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం ఐదుగురికి తీవ్ర గాయాలు*

విశాఖపట్నం, ఆనందపురం స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుక్కవాని పాలెం టోల్‌ప్లాజా వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు పోలీసుల వివరాల ప్రకారం ఆనంద పురం నుంచి పెందుర్తి వైపు వెళ్తున్న కారు దుక్కవాని పాలెం టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి సెంటర్ డివైడర్‌ను ఢీకొట్టింది అనంతరం రోడ్డు దాటి ఎదురుగా వస్తున్న లారీ ని ఢీకొంది ఈ ఘటనలో విజయనగరం జిల్లా డెంకాడ బొడ్డవలస కు చెందిన కారు డ్రైవర్ కోన రవికిషోర్ (36) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు కారులో ప్రయాణిస్తున్న రౌతు వరలమ్మ (60),కోన వర లమ్మ (50),రౌతు దుర్గ (47),కురుముంజి వరలక్ష్మి (50),బంటుపల్లి లక్ష్మి (40) గాయపడ్డారు వీరిలో రౌతు వరలమ్మకు తలకు,కోన వరలమ్మకు కుడి కంటి సమీపంలో గాయా లయ్యాయి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.