రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటి చైర్మన్లు కృషి చేయాలి…డైరెక్టర్ విజయ సునీత.
*విశాఖ పట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి *
ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటీల చైర్మన్లు కృషి చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత (ఐఎఎస్) కోరారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని 9 జిల్లాల మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు ఆమె ఆధ్వర్యంలో నగరంలో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మార్కెట్ కమిటీల చైర్మన్ల విధి విధానాలను కూలంకుషంగా వివరించారు. రైతులు పండించే పంటలను తక్కువ ధరకు అమ్ము కోకుండా వారికి అందుబాటులో ఉన్న మార్కెట్ కమిటీ గోదాములలో నిలువ చేసుకొని వారికి గిట్టుబాటు ధర వచ్చినపుడు అమ్ముకొనే విదంగా సౌకర్యాలు కల్పించడంలో ఆయా మార్కెట్ కమిటీల చైర్మన్లు కృషి చేయాలన్నారు. మార్కెట్ కమిటీల ప్రయోజనాలు రైతులకు తెలియ చెయ్యాలన్నారు. మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్ ఛైర్మెన్ లు కలిసి రైతులకు ప్రయోజనం చేకూరేలా పనిచేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పీ.సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కిరణ్, 4 జిల్లాల జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సెక్రెటరీలు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటి చైర్మన్లు కృషి చేయాలి…డైరెక్టర్ విజయ సునీత.
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటి చైర్మన్లు కృషి చేయాలి…డైరెక్టర్ విజయ సునీత. *విశాఖ పట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి * ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటీల చైర్మన్లు కృషి చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత (ఐఎఎస్) కోరారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని 9 జిల్లాల మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు ఆమె ఆధ్వర్యంలో నగరంలో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మార్కెట్ కమిటీల చైర్మన్ల విధి విధానాలను కూలంకుషంగా వివరించారు. రైతులు పండించే పంటలను తక్కువ ధరకు అమ్ము కోకుండా వారికి అందుబాటులో ఉన్న మార్కెట్ కమిటీ గోదాములలో నిలువ చేసుకొని వారికి గిట్టుబాటు ధర వచ్చినపుడు అమ్ముకొనే విదంగా సౌకర్యాలు కల్పించడంలో ఆయా మార్కెట్ కమిటీల చైర్మన్లు కృషి చేయాలన్నారు. మార్కెట్ కమిటీల ప్రయోజనాలు రైతులకు తెలియ చెయ్యాలన్నారు. మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్ ఛైర్మెన్ లు కలిసి రైతులకు ప్రయోజనం చేకూరేలా పనిచేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పీ.సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కిరణ్, 4 జిల్లాల జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సెక్రెటరీలు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు

