Monday, 15 June 2026
  • Home  
  • రేపే శని త్రయోదశి శ్రీ ఛాయామార్తాండ శనీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
- తిరుపతి

రేపే శని త్రయోదశి శ్రీ ఛాయామార్తాండ శనీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి తైలాభిషేకం ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం రామచంద్రపురం మండలం రాయల చెరువు పంచాయతీ చాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ ఛాయామార్తాండ శ్రీ శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. శనివారం శని త్రయోదశి (13 వ తేది) రోజున శ్రీ శనీశ్వర స్వామి ఆలయ అర్చకులు స్వామివారిని ప్రాతః కాలంలో సుప్రభాతం సేవతో మేల్కొల్పి. అనంతరం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తైలాభిషేకం జరుగుతుంది. తదుపరి పాలు పెరుగు నెయ్యి పంచామృతం సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ శాస్త్రృత్తంగా శని నివారణ, శాంతి హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి నివారణ హోమం చేస్తారు. ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న అభయ హస్త ఆంజనేయస్వామికి తమలపాకలతో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. సర్వ దోషాలకు నివారణ అయ్యేవిధంగాభక్తులచే గోపూజ కార్యక్రమం ఉంటుంది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శని త్రయోదశి రోజున శని ప్రభావం కలిగి రాశులు మేషం మీనం కుంభం ధనస్సు సింహరాశి గల భక్తులు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏనాటి శని, శాంతి హోమం, నవగ్రహ దోష నివారణ హోమం, గణపతి హోమం, చండీ హోమం వారి వారి గ్రహ స్థితులను అనుసరించి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు.ముఖ్యంగా శ్రీ శనీశ్వర స్వామి వారికి 19 ప్రదక్షిణలు అత్యంత ప్రీతికరమని, శని దశ 19 సంవత్సరాలు జీవిత కాలంలో ఉంటుందని, ఆ సమయంలో మనం చేసే ప్రతి కార్యము పుణ్యదాయకమై ఉండాలని, కర్మపల దాత శనీశ్వరుని అత్యంత పుణ్యకాలమని తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు చల్లటి పానీయాలు , అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.

ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి తైలాభిషేకం
ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ

పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం

రామచంద్రపురం మండలం రాయల చెరువు పంచాయతీ చాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ ఛాయామార్తాండ శ్రీ శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. శనివారం శని త్రయోదశి (13 వ తేది) రోజున శ్రీ శనీశ్వర స్వామి ఆలయ అర్చకులు స్వామివారిని ప్రాతః కాలంలో సుప్రభాతం సేవతో మేల్కొల్పి. అనంతరం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తైలాభిషేకం జరుగుతుంది. తదుపరి పాలు పెరుగు నెయ్యి పంచామృతం సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ శాస్త్రృత్తంగా శని నివారణ, శాంతి హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి నివారణ హోమం చేస్తారు. ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న అభయ హస్త ఆంజనేయస్వామికి తమలపాకలతో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. సర్వ దోషాలకు నివారణ అయ్యేవిధంగాభక్తులచే గోపూజ కార్యక్రమం ఉంటుంది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శని త్రయోదశి రోజున శని ప్రభావం కలిగి రాశులు మేషం మీనం కుంభం ధనస్సు సింహరాశి గల భక్తులు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏనాటి శని, శాంతి హోమం, నవగ్రహ దోష నివారణ హోమం, గణపతి హోమం, చండీ హోమం వారి వారి గ్రహ స్థితులను అనుసరించి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు.ముఖ్యంగా శ్రీ శనీశ్వర స్వామి వారికి 19 ప్రదక్షిణలు అత్యంత ప్రీతికరమని, శని దశ 19 సంవత్సరాలు జీవిత కాలంలో ఉంటుందని, ఆ సమయంలో మనం చేసే ప్రతి కార్యము పుణ్యదాయకమై ఉండాలని, కర్మపల దాత శనీశ్వరుని అత్యంత పుణ్యకాలమని తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు చల్లటి పానీయాలు , అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.