Thursday, 3 September 2026
  • Home  
  • రేపు జంగాల కండ్రిగ, ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రేపు జంగాల కండ్రిగ, ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన

ఆత్మకూరు, జూలై 15 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి , ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గురువారం (జూలై 16) సంగం మండలం జంగాల కండ్రిగ గ్రామం, ఆత్మకూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11:00 గంటలకు సంగం మండలం జంగాల కండ్రిగ గ్రామంలో నిర్వహించే స్థానిక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.అనంతరం సాయంత్రం 4:00 గంటలకు ఆత్మకూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం మంజూరైన పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.అలాగే, ఇటీవల ఎంపికైన 23 మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు నియామక పత్రాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేయనున్నారు. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయం, నెల్లూరు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆత్మకూరు, జూలై 15 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి , ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గురువారం (జూలై 16) సంగం మండలం జంగాల కండ్రిగ గ్రామం, ఆత్మకూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 11:00 గంటలకు సంగం మండలం జంగాల కండ్రిగ గ్రామంలో నిర్వహించే స్థానిక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అనంతరం సాయంత్రం 4:00 గంటలకు ఆత్మకూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం మంజూరైన పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.
అలాగే, ఇటీవల ఎంపికైన 23 మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు నియామక పత్రాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేయనున్నారు.

ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయం, నెల్లూరు ఒక ప్రకటనలో వెల్లడించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.