ఖమ్మం
(పున్నమి న్యూస్)
సూర్యాపేట–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి రేపటి నుంచి వాహనదారులకు అందుబాటులోకి రానున్నది . ఈ హైవే ప్రారంభంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడటంతో వాణిజ్య, వ్యవసాయ రవాణాకు కూడా ఊతం లభించనుంది. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

