Monday, 29 June 2026
  • Home  
  • రూపకల్పనకు కృషి అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయాలి – తహసీల్దార్ లక్ష్మీ లావణ్య
- తూర్పు గోదావరి

రూపకల్పనకు కృషి అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయాలి – తహసీల్దార్ లక్ష్మీ లావణ్య

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూన్ 29: కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో పోలింగ్ కేంద్రాలు నంబర్–3, 4 పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సోమవారం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ, ఇంటింటి సర్వే ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని గుర్తించి కొత్త ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. అలాగే మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను వెంటనే తొలగించి ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం–6, ఓటు తొలగింపునకు ఫారం–7, చిరునామా లేదా ఇతర వివరాల మార్పులకు ఫారం–8 ద్వారా దరఖాస్తులు స్వీకరించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి వంద శాతం స్వచ్ఛమైన, తప్పులులేని ఓటరు జాబితాను రూపొందించాలని ఆమె సూచించారు. “ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. అర్హులైన ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు లేకుండా ఉండకూడదు. అదే సమయంలో అనర్హుల పేర్లు కూడా జాబితాలో ఉండరాదు. అందరి సహకారంతో పోచవరాన్ని ఆదర్శ ఓటరు జాబితా కలిగిన గ్రామంగా తీర్చిదిద్దుదాం” అని తహసీల్దార్ లక్ష్మీ లావణ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల సూపర్‌వైజర్, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), గ్రామ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూన్ 29:
కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో పోలింగ్ కేంద్రాలు నంబర్–3, 4 పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సోమవారం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ, ఇంటింటి సర్వే ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని గుర్తించి కొత్త ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. అలాగే మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను వెంటనే తొలగించి ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆదేశించారు.
కొత్త ఓటరు నమోదుకు ఫారం–6, ఓటు తొలగింపునకు ఫారం–7, చిరునామా లేదా ఇతర వివరాల మార్పులకు ఫారం–8 ద్వారా దరఖాస్తులు స్వీకరించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి వంద శాతం స్వచ్ఛమైన, తప్పులులేని ఓటరు జాబితాను రూపొందించాలని ఆమె సూచించారు.
“ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. అర్హులైన ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు లేకుండా ఉండకూడదు. అదే సమయంలో అనర్హుల పేర్లు కూడా జాబితాలో ఉండరాదు. అందరి సహకారంతో పోచవరాన్ని ఆదర్శ ఓటరు జాబితా కలిగిన గ్రామంగా తీర్చిదిద్దుదాం” అని తహసీల్దార్ లక్ష్మీ లావణ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల సూపర్‌వైజర్, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), గ్రామ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.