*
కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న రీ-సర్వే కార్యక్రమాల పురోగతి మరియు రెవెన్యూ డే వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై గౌరవనీయులైన రెవెన్యూ డివిజనల్ అధికారి, కావలి గారి అధ్యక్షతన శనివారం ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఆర్డీఓ గారు మాట్లాడుతూ రీ-సర్వే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండలాల వారీగా రీ-సర్వే పురోగతిని సమీక్షించి, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఫీల్డ్ స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, రీ-సర్వే ప్రక్రియలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రెవెన్యూ డే సందర్భంగా
రెవెన్యూ శాఖ అందిస్తున్న వివిధ సేవలు ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. భూ రికార్డుల నిర్వహణ, వివిధ ధృవపత్రాల జారీ, విపత్తుల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ తదితర కీలక సేవల ద్వారా రెవెన్యూ శాఖ ప్రజలకు నిరంతరం సేవలందిస్తోందని తెలిపారు.
రెవెన్యూ శాఖలో తహసీల్దార్లుగా మరియు ఇతర వివిధ హోదాల్లో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. వారి సేవలను గుర్తించి గౌరవించడం ద్వారా శాఖ పట్ల ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో D.Elisha Babu, RDO, Kavali, DPreameela , DAO, కావలి తహసీల్దార్ శ్రీ పి. శ్రావణ్ కుమార్, బోగోలు తహసీల్దార్ శ్రీ ఎస్. శ్రీనివాసులు రెడ్డి, అల్లూరు తహసీల్దార్ శ్రీ నవీన్, దగదర్తి తహసీల్దార్ శ్రీ లాజరస్, వింజమూరు తహసీల్దార్ శ్రీమతి స్వర్ణ, కొండాపురం తహసీల్దార్ శ్రీ అనిల్, దుత్తలూరు తహసీల్దార్ శ్రీ వై. నాగరాజు, విడవలూరు తహసీల్దార్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, కొడవలూరు తహసీల్దార్ శ్రీమతి స్పూర్తి, వరికుంటపాడు తహసీల్దార్ శ్రీ హేమంత్ కుమార్, కలిగిరి తహసీల్దార్ శ్రీ గిరీష్, జలదంకి తహసీల్దార్ శ్రీమతి సీతామహాలక్ష్మి, మండల సర్వేయర్లు మరియు రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.


