ఆగస్టు 27, 2026
ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉద్దేశించిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులను అందుబాటులోకి తెచ్చి, ఏఐ (AI) ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సాధించిన ఫలితాల ఆధారంగా పక్కా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఏపీ హెల్త్ మోడల్ దేశానికే మార్గదర్శకంగా నిలిచేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేసి, వైద్య సేవా రంగంలో అనూహ్య మార్పులు తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ‘సంజీవని’ ప్రాజెక్టు
ఆగస్టు 27, 2026 ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉద్దేశించిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులను అందుబాటులోకి తెచ్చి, ఏఐ (AI) ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సాధించిన ఫలితాల ఆధారంగా పక్కా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఏపీ హెల్త్ మోడల్ దేశానికే మార్గదర్శకంగా నిలిచేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేసి, వైద్య సేవా రంగంలో అనూహ్య మార్పులు తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

