రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు; కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు; రుద్ర ప్రదీప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు; నెల్లూరి కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు; నున్న రవికుమార్, పాలేరు అసెంబ్లీ ఇంచార్జి; డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు; ఇవి రమేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ విలువలు, పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందించడంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరూ ఐక్యతతో, సోదరభావంతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.


