రాజన్న సిరిసిల్ల జూలై 19 (పున్నమి ప్రతినిధి )
ముస్తాబాద్, జూలై 19: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మూడు చెక్కులను ముస్తాబాద్ మండల మాజీ జడ్పీటీసీ మెరుగు యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పోచమ్మల వనిత, గ్రామ సర్పంచ్ పిల్ల మురళి, ఉపసర్పంచ్ మోతే బాలరాజు, ముస్తాబాద్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మెరుగు సతీష్ గౌడ్, వార్డు సభ్యురాలు బోలవేణి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.


