ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లాలో మెడిసిన్, ఐఐటీ, జేఈఈ మెయిన్స్ కోచింగ్ అకాడమీలు, ట్యూషన్ పాయింట్లలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) కె. రవిబాబు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్లో చేరదలచిన విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇంటర్ బోర్డు అనుమతి పొందిన జూనియర్ కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని సూచించారు. అకాడమీలు, ట్యూషన్ పాయింట్ల ద్వారా అక్రమంగా ఇంటర్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత జూనియర్ కళాశాలలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుమతి లేని సంస్థల్లో ప్రవేశాలు తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.



