Saturday, 16 May 2026
  • Home  
  • “తడ “నుంచి “గుంటూరు “వరకు రాజుకున్న తీరం ..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“తడ “నుంచి “గుంటూరు “వరకు రాజుకున్న తీరం ..

తమిళనాడు బోట్ల వివాదం ఇంతై అంతై తడ నుంచి గుంటూరు జిల్లా రామాపురం పల్లిపాలెం వరకు పాకింది. తమిళ బోట్లు తరలింపు సమస్య దాదాపు 143 గ్రామాలకు కీలకమైంది. ఈ విషయంలో ఈ గ్రామాలన్నిటికీ పెద్దకాపుగా ఉన్న వ్యక్తే కీలకం కావడం మత్స్యకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది . తమ జీవనోపాధికి సంబంధించిన ఎన్నో సంవత్సరాల సమస్య పై తాము నమ్ముకున్న పెద్దకాపే తమను పక్కదారి పట్టించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా మత్స్యకారులు ఎంతగా ప్రేమిస్తారో…. దారితప్పితే అంతగా ద్వేషిస్తారు.. అన్నది వారి జీవనశైలి. ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కరించే దిశలో రాజకీయ నాయకులను ,అధికారులను దూరం పెట్టేసిన మత్స్యకారులు ఏప్రిల్ మూడవ తేదీ 143 గ్రామాల కాపులతో కీలక సమావేశం నిర్ణయించారు. సమావేశం అజెండా లక్ష్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా తమిళ బోట్ల విడుదల సమస్య ఏకైక అజెండాగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. బోట్ల తరలింపు పై ఆందోళన చెందిన ఇసుక పల్లి పల్లి పాలెం వాసులు తమను మిగిలిన 142 గ్రామాల కాపులు బహిష్కరిస్తారని భయపడి ముందస్తుగా ముగ్గురు కాపులను నిర్బంధించి గ్రామానికి సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. బాధ్యులైన కాపులను బంధించకపోతే తమ ఆచారం ప్రకారం బహిష్కరణ గురైతే గ్రామ వాసులందరికీ ఇబ్బందువుతోందని కట్టుబాటుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం . గ్రామస్తులు ముందస్తుగా కాపులను ఇలా కట్టి వేయడంతో 142 గ్రామాల వారు కొంత సంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది .ఇక బోట్ల విడుదలకు ఎవరు ఎలా అనే విషయం మూడో తేదీలోపు స్పష్టతకు వచ్చిన తర్వాత 143 గ్రామాలకు సంబంధించి కాపు లు తీసుకునే నిర్ణయం కఠినంగానే ఉండవచ్చు అని తెలుస్తోంది. గతంలో ఒక సంఘటనలో ఇప్పటి టీటీడీ చైర్మన్ అప్పటి జిల్లా కలెక్టర్ గా ఉన్న మద్దాడ రవిచంద్ర కు తమ సమస్య పరిష్కారం తెలుపాలని లక్ష్యంతో మత్స్యకారులు కలెక్టర్ బంగళా చుట్టూ పడవలు పెట్టి కొన్ని గంటల పాటు చేసిన ధర్నా కార్యక్రమం నాడు రాష్ట్రంలో సంచలనం గా మారింది. అదేవిధంగా 2004లో చెన్నాయి పాలెం పెదపట్టపాలెం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు పాలకులకు తీవ్ర తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు పదిమంది కి పైగా ఆ గ్రామంలో గంటలసేపు బైఠాయించాల్సిన పరిస్థితి నెలకొంది .అయినా ఆ సంఘటనలో పట్టిన పట్టు వారు వీడలేదు. అధికారాలతో రాజకీయాలతో వ్యవహారాన్ని ముడి పెట్టాల్సిన అవసరం లేదని ఇది తమ జీవనోపాధికి సంబంధించిందని కాపులు చేసిన సూచనలతో తీరంలోని 143 గ్రామాల మత్స్యకార ప్రజలు ఏకీభవించడంతో ఈ సమస్య ఎటు వెళ్లుతుందనేది అర్థం కాని విషయమే. మత్స్యకారుల మనోభావాలపై నేటి యువ అధికారులకు సరైన అవగాహన లేని నేపథ్యంలో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చాలా కసరత్తులు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది .ఎక్కడైనా ఏదైనా తొందరపాటు చర్య జరిగితే అది గతంలో అల్లూరు బోగోలు తీరంలో జరిగిన సంఘటనలు పురావృత్తం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందనేది సమాచారం. ఈ సమస్యకు ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ అంశం కూడా తోడు కావడం, మరోవైపు చెన్నాయి పాలెం పెదపట్టపాలెం భూముల సమస్య కూడా రోడ్డుకి ఎక్కడంతో జిల్లా అధికారులకు మాత్రం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తమిళనాడు బోట్ల వివాదం ఇంతై అంతై తడ నుంచి గుంటూరు జిల్లా రామాపురం పల్లిపాలెం వరకు పాకింది. తమిళ బోట్లు తరలింపు సమస్య దాదాపు 143 గ్రామాలకు కీలకమైంది. ఈ విషయంలో ఈ గ్రామాలన్నిటికీ పెద్దకాపుగా ఉన్న వ్యక్తే కీలకం కావడం మత్స్యకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది . తమ జీవనోపాధికి సంబంధించిన ఎన్నో సంవత్సరాల సమస్య పై తాము నమ్ముకున్న పెద్దకాపే తమను పక్కదారి పట్టించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా మత్స్యకారులు ఎంతగా ప్రేమిస్తారో…. దారితప్పితే అంతగా ద్వేషిస్తారు.. అన్నది వారి జీవనశైలి. ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కరించే దిశలో రాజకీయ నాయకులను ,అధికారులను దూరం పెట్టేసిన మత్స్యకారులు ఏప్రిల్ మూడవ తేదీ 143 గ్రామాల కాపులతో కీలక సమావేశం నిర్ణయించారు. సమావేశం అజెండా లక్ష్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా తమిళ బోట్ల విడుదల సమస్య ఏకైక అజెండాగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. బోట్ల తరలింపు పై ఆందోళన చెందిన ఇసుక పల్లి పల్లి పాలెం వాసులు తమను మిగిలిన 142 గ్రామాల కాపులు బహిష్కరిస్తారని భయపడి ముందస్తుగా ముగ్గురు కాపులను నిర్బంధించి గ్రామానికి సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. బాధ్యులైన కాపులను బంధించకపోతే తమ ఆచారం ప్రకారం బహిష్కరణ గురైతే గ్రామ వాసులందరికీ ఇబ్బందువుతోందని కట్టుబాటుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం . గ్రామస్తులు ముందస్తుగా కాపులను ఇలా కట్టి వేయడంతో 142 గ్రామాల వారు కొంత సంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది .ఇక బోట్ల విడుదలకు ఎవరు ఎలా అనే విషయం మూడో తేదీలోపు స్పష్టతకు వచ్చిన తర్వాత 143 గ్రామాలకు సంబంధించి కాపు లు తీసుకునే నిర్ణయం కఠినంగానే ఉండవచ్చు అని తెలుస్తోంది. గతంలో ఒక సంఘటనలో ఇప్పటి టీటీడీ చైర్మన్ అప్పటి జిల్లా కలెక్టర్ గా ఉన్న మద్దాడ రవిచంద్ర కు తమ సమస్య పరిష్కారం తెలుపాలని లక్ష్యంతో మత్స్యకారులు కలెక్టర్ బంగళా చుట్టూ పడవలు పెట్టి కొన్ని గంటల పాటు చేసిన ధర్నా కార్యక్రమం నాడు రాష్ట్రంలో సంచలనం గా మారింది.
అదేవిధంగా 2004లో చెన్నాయి పాలెం పెదపట్టపాలెం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు పాలకులకు తీవ్ర తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు పదిమంది కి పైగా ఆ గ్రామంలో గంటలసేపు బైఠాయించాల్సిన పరిస్థితి నెలకొంది .అయినా ఆ సంఘటనలో పట్టిన పట్టు వారు వీడలేదు. అధికారాలతో రాజకీయాలతో వ్యవహారాన్ని ముడి పెట్టాల్సిన అవసరం లేదని ఇది తమ జీవనోపాధికి సంబంధించిందని కాపులు చేసిన సూచనలతో తీరంలోని 143 గ్రామాల మత్స్యకార ప్రజలు ఏకీభవించడంతో ఈ సమస్య ఎటు వెళ్లుతుందనేది అర్థం కాని విషయమే. మత్స్యకారుల మనోభావాలపై నేటి యువ అధికారులకు సరైన అవగాహన లేని నేపథ్యంలో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చాలా కసరత్తులు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది .ఎక్కడైనా ఏదైనా తొందరపాటు చర్య జరిగితే అది గతంలో అల్లూరు బోగోలు తీరంలో జరిగిన సంఘటనలు పురావృత్తం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందనేది సమాచారం. ఈ సమస్యకు ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ అంశం కూడా తోడు కావడం, మరోవైపు చెన్నాయి పాలెం పెదపట్టపాలెం భూముల సమస్య కూడా రోడ్డుకి ఎక్కడంతో జిల్లా అధికారులకు మాత్రం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.