ముల్లపెరియార్ ఆనకట్ట భద్రతను పరిశీలించే సమగ్ర డ్యామ్ భద్రతా మూల్యాంకన కమిటీ (CDSEC) నుంచి కేరళ ప్రతినిధి టి.కె. శివరాజన్‌ను తొలగించడంపై కేరళకు చెందిన కాంగ్రెస్, సీపీఎం ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వారు ఆరోపించారు. 129 ఏళ్ల పురాతనమైన ముల్లపెరియార్ డ్యామ్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉండటంతో భద్రతపై ప్రజల్లో ఆందోళన ఉందని ఎంపీలు పేర్కొన్నారు. డ్యామ్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. శివరాజన్‌ను తిరిగి కమిటీలో చేర్చాలని కేంద్రాన్ని కోరారు.

ముల్లపెరియార్ డ్యామ్ కమిటీ నుంచి కేరళ ప్రతినిధి తొలగింపు.. ఎంపీల నిరసన