కొమరం భీమా ఆసిఫాబాద్ పున్నమి ప్రతినిధి , జూన్ 30: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ఆమోదించిన అధికారిక డైట్ మెనూను అమలు చేయడం లేదని రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి అధికారిక డైట్ మెనూ ప్రకారం గర్భిణీలు, చిన్నారులు, సాధారణ రోగులకు పాలు, బ్రెడ్, గుడ్లు, అరటిపండ్లు, పెరుగు/మజ్జిగ, కూరలు, సాంబారు, నిర్ణీత పరిమాణంలో అన్నం వంటి పోషకాహారం అందించాల్సి ఉంది. అయితే మెనూలో పేర్కొన్న ఆహార పదార్థాలు, నిర్ణయించిన పరిమాణంలో భోజనం అందించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించిన డైట్ మెనూ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు.
రోగుల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన డైట్ మెనూ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి, డైట్ మెనూను అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని, రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నాణ్యమైన, పరిశుభ్రమైన, సరిపడా ఆహారం అందేలా కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ సందర్శించినా మారని ప్రభుత్వ ఆసుపత్రి… రోగులకు డైట్ కరువు..!
కొమరం భీమా ఆసిఫాబాద్ పున్నమి ప్రతినిధి , జూన్ 30: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ఆమోదించిన అధికారిక డైట్ మెనూను అమలు చేయడం లేదని రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి అధికారిక డైట్ మెనూ ప్రకారం గర్భిణీలు, చిన్నారులు, సాధారణ రోగులకు పాలు, బ్రెడ్, గుడ్లు, అరటిపండ్లు, పెరుగు/మజ్జిగ, కూరలు, సాంబారు, నిర్ణీత పరిమాణంలో అన్నం వంటి పోషకాహారం అందించాల్సి ఉంది. అయితే మెనూలో పేర్కొన్న ఆహార పదార్థాలు, నిర్ణయించిన పరిమాణంలో భోజనం అందించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించిన డైట్ మెనూ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. రోగుల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన డైట్ మెనూ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి, డైట్ మెనూను అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని, రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నాణ్యమైన, పరిశుభ్రమైన, సరిపడా ఆహారం అందేలా కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

