ఖమ్మం నగరంలోని మున్నేరు నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం అధికంగా వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మున్నేరు బ్రిడ్జి డౌన్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఈ మార్గంలో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. మున్నేరు ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.



